| Daily భారత్
Logo




మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి

News

Posted on 2026-04-02 05:08:24

Share: Share


మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువై, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో, విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు సెస్ ఎండీ బిక్షపతి తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు, వినియోగదారుల పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి సేవలను ఇప్పటి నుంచి ఏ మీసేవ కేంద్రంలో అయినా పొందవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు తమ సమీప మీ సేవ కేంద్రంలోనే సమస్త విద్యుత్ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు . 

మీ సేవ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు...

కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు : గృహ, వ్యాపార  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పుడు ప్రతి మీ సేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ నుండి మంజూరు వరకు మొత్తం ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది. 

వినియోగదారు పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు : మీ సేవ కేంద్రాల్లో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు. 

ఇతర సేవలు : లోడ్ మార్పు, తాత్కాలిక కనెక్షన్, కనెక్షన్ తొలగింపు, మొదలైన అన్ని సేవలు కూడా మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఇప్పటి వరకు విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి ఇవ్వాల్సిన దరఖాస్తులను, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న ఏ మీసేవ కేంద్రంలో అయినా ఇవ్వొచ్చు అన్నారు. వినియోగదారుల సౌకర్యమే మా ప్రథమ లక్ష్యం" అని, పారదర్శకంగా నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >