Posted on 2026-04-01 12:11:18
పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
దమ్మపేట గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్ అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. వడ్డించిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా వండకపోవడం, రుచి లోపించడం గమనించి విద్యార్థులకు పోషక విలువలతో ఆహారం అందించాలని ఆదేశించారు.
చిన్న పాఠశాలల్లో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తున్నప్పుడు ఇక్కడ లోపాలు ఉండటం తగదని పేర్కొని, వెంటనే సరిచేయాలని సూచించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాన్ని పరిశీలించి, ట్యాపులు లేక నీరు వృథా అవుతున్న అంశంపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డు సభ్యురాలు దుర్గ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Education #MiddayMeal #Telangana
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >