| Daily భారత్
Logo




FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

News

Posted on 2026-04-01 09:56:39

Share: Share


FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నేషనల్ హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు ఒక ముఖ్యమైన వార్త. మీరు మీ కారుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) వాడుతున్నారా? అయితే ఇకపై మీ జేబుకు కొంచెం అదనపు భారం పడక తప్పదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టోల్ టాక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పాస్‌లను వాడుతున్న లక్షలాది మంది ప్రైవేట్ వాహన యజమానులపై ఈ ప్రభావం పడనుంది.

ప్రస్తుతం ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర 3000 రూపాయలుగా ఉంది. కానీ, 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీని ధర 3,075 రూపాయలకు పెరగనుంది. అంటే నేరుగా 75 రూపాయల ధర పెరిగిందన్నమాట. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2025 ఆగస్టు 15న ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రైవేట్ వాహన యజమానులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం దాదాపు 56 లక్షల వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ ద్వారా టోల్ చెల్లింపులు చేస్తున్నాయి.

అయితే కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి, వాహనదారులకు ఇప్పటికీ కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ పాస్ రినవల్ దగ్గరకు వచ్చినా లేదా మీరు కొత్తగా పాస్ తీసుకోవాలని అనుకుంటున్నా.. మార్చి 31వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు పాత ధరకే అంటే 3,000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక్కో పాస్‌పై మీరు నేరుగా 75 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.ఈ పాస్‌ను మీరు ఇంటి నుండే ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ‘రాజమార్గ యాత్ర’ యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్ ద్వారా తీసుకోవాలనుకుంటే.. ముందుగా ఎన్‌హెచ్‌ఏఐ సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూలో ఉన్న ‘ ఫస్ట్ట్యాగ్ ఆన్యూల్ పాస్’ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ వాహనం, ఫాస్టాగ్ వివరాలను నమోదు చేయాలి. మీ అర్హతను ధృవీకరించిన తర్వాత ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సరిపోతుంది.యాప్ ద్వారా అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌లో రాజమార్గ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మీ ఫాస్టాగ్ ఖాతాను యాప్‌కు లింక్ చేసిన తర్వాత, యాన్యువల్ పాస్ సెక్షన్‌లోకి వెళ్లి మీ వాహనాన్ని ఎంచుకుని ఫీజు చెల్లించాలి. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >