ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38) కి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో విశాల్ రెడ్డి సహకారంతో రక్తాన్ని కాలంలో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తనిధి కేంద్రాలలో రక్త కొరత ఏర్పడడం జరిగిందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని యువత మానవత దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతగా నిలిచిన విశాల్ రెడ్డికి,సహకరించిన సాయి కృష్ణకు అభినందనలు తెలియజేశారు