డైలీ భారత్ తమిళ నాడు: తమిళ నాడు రాష్ట్రం టివికె పార్టీ అధినేత విజయ్ తన పర్సనల్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే శబరినాథన్ వేదికపై విజయ్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శబరినాథన్ ప్రస్తుతం ఆ పార్టీ ఐటీ వింగ్ బాధ్యతలను చూస్తున్నారు. అంతకుముందు విజయ్ అభిమాన సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు.
News
కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టివికె పార్టీ అధినేత విజయ్