Posted on 2026-03-29 18:59:42
క్రీడల్లో గెలుపొందిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను అభినందించిన వరల్డ్ ఐటి చైర్మన్ సందీప్ కుమార్
డైలీ భారత్, కామారెడ్డి:క్రీడల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీల్లో హైదరాబాదు లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని క్రీడాకారులు పోటీలో పాల్గొనడం జరిగిందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ (కామారెడ్డి జిల్లా ఇంచార్జి) చెల్లాపురం శ్రీకాంత్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ అథ్లెటిక్స్ క్రీడల్లో భాగంగా అథ్లెటిక్స్,బ్యాట్మెంటన్,చెస్, 2కే 3కే రన్,కరాటే, పోటీలలో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరచడమే కాకుండా క్రీడా ప్రతిభకు ప్రతీకగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అండర్ 17 డబుల్స్ కేటగిరి బ్యాట్మెంటన్ లో మహిళలు అవని రెడ్డి, ఆరాధ్య రెడ్డి లు విజయం సాధించగా, అండర్ 9 సింగిల్స్ కేటగిరీలో వెంకట్ సిల్వర్ మెడల్, అంతేకాకుండా ధనుష్ కుమార్ 2k,3k రన్ 100,200 మీటర్స్ లో ద్వితీయ బహుమతి సాధించడం జరిగిందనీ తెలిపారు.ఈ క్రీడల్లో గెలుపొందిన వారిని వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్ ప్రశంసించడం జరిగిందనీ అన్నారు.
ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రశంస పత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు తదితరులు ఉన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >