Posted on 2026-03-29 09:56:23
డైలీ భారత్, మేడ్చల్:మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కాప్రాకు చెందిన తిరునాయన అనే విద్యార్థిని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు, అనారోగ్య కారణాలతో కళాశాలకు తరచూ హాజరు కాలేకపోయారు. ఇందుకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అయితే, మొదటి సంవత్సరం నుంచే లెక్చరర్లు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్‌లోని ఫోటోలను షేర్ చేస్తూ, వ్యక్తిత్వంపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు.
ఇటీవల మళ్లీ అనారోగ్యం బారిన పడగా.. “కళాశాలకు రాకుండా ఎవరితో తిరుగుతున్నావు?” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి మానసిక ఒత్తిడికి గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >