డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా రోకటిరంగారావు పార్టీ అధినేత నందమూరి తారక రామారావు మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పార్టీ విజయంలో వారి పాత్రను కొనియాడారు. మరియు పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అది కేవలం నాయకులది కాదు, అది నిఖార్సైన "కార్యకర్తల పార్టీ" అని ప్రకటించారు.
ఈ సందర్భంగా, పార్టీ శ్రేణులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రగతి, ప్రజాసంక్షేమం కోసం పుట్టిన ఈ పార్టీ తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. పేదవారి ఆకలి తీర్చేందుకు, స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు రెండు రూపాయల కి.గ్రా బియ్యం పథకం, పెన్షన్, జనాతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు