Posted on 2026-03-29 11:13:27
డైలీ భారత్, ఖమ్మం: ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 2 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందుతులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపార వేత్త కి వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ లో Fx Pro కంపెనీలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను 7 లక్షలు రూపాయిలు అక్కౌంట్ కి వెళ్ళిన అక్కౌంట్ హోల్డర్స్ అయిన ఎండి. సాదిక్ (35సం), శ్యామ్ బాబు (21సం) లను , తణుకు లో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ, CH.R.V. ఫణిందర్, ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేశ్ , ఎస్సై రoజిత్ కుమార్ , కానిస్టేబుల్స్ వెంకట కృష్ణరావు ,కిషన్ రావు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >