| Daily భారత్
Logo




శ్రీ సీతారామ దివ్య చరితం : మంజుల పత్తిపాటి

News

Posted on 2026-03-26 06:11:04

Share: Share


శ్రీ సీతారామ దివ్య చరితం :  మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

శ్రీ సీతారామ దివ్య చరితం

జనకాత్మజా జానకీ జగదంబ రూపిణి జ్యోతిర్మయి,

శుభలక్షణ శోభితాంగి శశిముఖి శాంతస్వరూపిణి;

రఘువంశ తిలకుడైన రాముని హృదయరత్నమై,

భువనమంత వెలుగొందె భక్తజన పావన సౌభాగ్యము!

మృదుమందహాస విహారిణి మానస సరస్సు కమలమై,

మంగళ గుణగణ గర్భిణి మాతృస్వరూపిణి మాధుర్యమై;

అరణ్యాంతర గాఢవిపినమున అనుబంధమై నిలిచినది,

అనురాగ దీప్తి సాక్షిగా అచంచల సత్యసంకల్పమై!

రామో విగ్రహవాన్ ధర్మో రమణీయ గుణసాగరో,

సీతా సహచర్యమున్ సదా సౌమ్యమూర్తి సుపావనుడు;

సముద్రం సైతం సంభ్రమించు శౌర్య గంభీర వైభవం,

సేతుబంధ కీర్తి సాక్షిగా సాగరమే స్తుతించెను!

విరహాగ్ని వేడిలోనూ విశ్వాస దీప్తి మాయంకాక,

సీతా హృదయం సత్యసింధు స్ఫటికమై నిలిచెను;

రాముని నామస్మరణే రక్షణమై మార్గదర్శిగా,

ధర్మదీపికగా దివ్యదాంపత్య గాథను నిలిపెను!

అశోకవాటికలో ఆర్తిగా నిలిచిన ఆ మంగళ రూపం,

అమృతధారల కన్నీరై ఆకాశమున్ పలికె గాథ;

ఆ దుఃఖ గాఢతను చీల్చి ఆంజనేయుని దర్శనముతో,

ఆశల చిగురులు విరిసె ఆత్మవిశ్వాస సాక్షిగా!

లంకాపురి లయగర్జనలో రామబాణ జ్వాలలతో,

దశముఖ దర్ప దహనమై ధర్మజయం ఘోషించగా;

సీతా రాముల కలయికలో సర్వలోక మంగళ గానం,

సత్యసంధాన సౌభాగ్యమై సకలజన హృదయముల నిండె!

శ్రీరామ సీతల నామమిదే శాశ్వత మంత్రస్వరూపము,

చిత్తశుద్ధి చెలిమెలై చిగురించే చైతన్య దీపము;

భక్తి పరవశ తరంగిణిలో భవసాగరము దాటించు,

పరబ్రహ్మ సాక్షాత్కార పథమిదే పావన సత్యము

చైత్రమాస శుక్లపక్ష నవమి పుణ్యకళ్యాణ పర్వదినంబున,

సేవాసౌభాగ్య సుధాసింధువై నా చిత్తమున్ పరిపూర్ణమై;

మంజుల పత్తిపాటి మృదులకరాంబుజములందు

శ్రీ సీతారామ కల్యాణ కృత్యము సుగంభీరమై సాగుచుండగా,

కరుణామయ! కటాక్ష కృపాప్రవాహమే కలిగించితివి ఈ మహాభాగ్యమున్ రామయ్య!

భక్తి పరవశ హృదయంతో శరణాగతి సమర్పించగా,

జన్మార్థక పరమసాఫల్యమై జయనినాదములై విరిసె!

శ్రీ సీతారామ చరణారవింద సేవాసుధా ప్రసాదమున్ స్ఫూర్తి సింధువై,

మంజుల కలమున్ కళామాత కృపతో పద్యరత్నాల వికాసమై;

భక్తహృదయ భావసుమాల వాక్సుధా ప్రవాహమున్ వెలిగించగా,

సీతారామ కటాక్షమే ధన్యజీవిత సత్యమై నిలిచె!

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు!


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్,

చరవాణి 9347042218

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >