Posted on 2026-03-20 15:40:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ఏపీ లోని ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. వీరిలో ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు, భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతు అయిన వారి కోసం పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగారు. వీరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. ఒకరిని కాపాడబోయి.. మరొకరు ఇలా నీటిలో మునిగిపోయారు.
ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోక తేజ, నవదీప్ ఉయ్యూరు ప్రాంతానికి చెందినవారు. పాశం సతీష్ కుమార్ మదనపల్లి, చారు గుండ్ల శ్రీకర్, పొడిచేటి అభిరామ్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇవాళ్లంతా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఇప్పటి వరకూ శ్రీకర్, నవదీప్ ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >