Posted on 2026-03-20 15:06:56
విద్యారంగానికి బడ్జెట్ లో కనీసం 15% కేటాయింపులు జరపాలి
పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ
డైలీ భారత్, కామారెడ్డి: 2026-27ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు 26,674 కోట్లు,గత సంవత్సరం కంటే అదనంగా 3566 కోట్లు అదనంగా విద్యకు కేటాయించినప్పటికీ, విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా ప్రస్తుత బడ్జెట్లో విద్యకు కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించడం సరైనది కాదు. అదేవిధంగా ఈ బడ్జెట్లో పిఆర్సి ప్రస్తావన ఉంటుంది, దానికి నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది
ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు నెలలలోపు పిఆర్సిని అమలు చేస్తామని చెప్పి 27 నెలలు అవుతున్నా గానీ, పిఆర్సికి సంబంధించిన కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో కనపడకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశకు గురి చేసింది
వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేయడాన్నీ స్వాగతిస్తున్నాం.ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1056 కోట్ల కేటాయింపును స్వాగతిస్తూ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు,పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డుల పై నగదురహిత వైద్యము అందించాలి
కొత్త పేర్లతో పాఠశాలను స్థాపించకుండా ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేసి నిధులు కేటాయించినట్టయితే విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రస్తుత బడ్జెట్లో కనీసం 15% తగ్గకుండా నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పాటుపడలని కోరుతున్నాం.
*అంబీర్ మనోహర్ రావు, జిల్లా అధ్యక్షులు, జనపాల లక్ష్మీరాజం,జిల్లా ప్రధాన కార్యదర్శి, పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >