Posted on 2026-03-20 14:02:18
నిందుతుల వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం.
డైలీ భారత్, సిరిసిల్ల: తేదీ 17-03-2026 రోజు రాత్రి సమయంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయినగర్ లో మేర్గు లత తన ఇంటి వద్ద గేటు బయటకు రాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ మెడలోగల బంగారు పుస్తెలు బలవంతంగా తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోగా,మేర్గు లత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందుతులను సయ్యద్ మౌలాన,మంగురు ప్రకాష్ యాదవ్ లుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందితులు సిరిసిల్ల కు వస్తున్నరన్న సమాచారం మేరకు రడుగు చౌరస్తా వద్ద నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు బంగారు పుస్తెలు(4.4 గ్రాములు),ద్విచక్ర వాహనం,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను రిమాండుకి ఈరోజు పంపించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాలలో, పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరినారు.
నిందితుల వివరాలు:
A1. సయ్యద్ మౌలాన తండ్రి: బడే సాబ్, వయస్సు: 22 సం లు. r/o తుర్కశినగర్ కొడిమ్యాల, మండల జగిత్యాల జిల్లా.
A2. మంగురు ప్రకాష్ యాదవ్, తండ్రి: ధర్మేందర్, వయస్సు: 19 సం లు. r/o వేదిరే గ్రామం, రామడుగు మండల, కరీంనగర్ జిల్లా.
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >