| Daily భారత్
Logo




టెన్త్ పరీక్షల్లో కఠిన నిబంధనలు… ‘జీరో మొబైల్ జోన్’ అమలు

News

Posted on 2026-03-20 11:14:04

Share: Share


టెన్త్ పరీక్షల్లో కఠిన నిబంధనలు… ‘జీరో మొబైల్ జోన్’ అమలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తూ ‘జీరో మొబైల్ జోన్’ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు కేవలం విద్యార్థులకే కాకుండా ఇన్విజిలేటర్లు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్స్ తీసుకెళ్లరాదని ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రం ఫోన్ ద్వారా బయటకు రావడం తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఈ కొత్త నియమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ విధుల్లో చేరే ముందు తమ వద్ద ఎలాంటి ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డే-వైజ్ డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది.

సంతకం చేసినప్పటికీ సిబ్బంది వద్ద ఫోన్లు ఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తిస్తే, దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోన్లను వినియోగిస్తే 1997 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదనంగా సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.

సిబ్బంది చేసిన తప్పులకు చీఫ్ సూపరింటెండెంట్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై శుక్రవారం ఎగ్జామినేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >