| Daily భారత్
Logo




ఫీజుల కోసం పోరు దీక్ష

News

Posted on 2026-03-14 21:32:57

Share: Share


ఫీజుల కోసం పోరు దీక్ష

(15 ఆదివారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో దీక్ష

కాంట్రాక్టర్లకు 70 వేల కోట్లు ఇచ్చి,ఫీజుల కోసం ఏడు వేల కోట్లు ఇవ్వరా ?

నీల నాగరాజు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు

జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ 

రెండు సంవత్సరాల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారీస్తే ప్రభుత్వ పీఠాలు కదిలిస్థాం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరికి ఎంత నిధులు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు 

డైలీ భారత్, కామారెడ్డి: ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని,ఈ బడ్జెట్ లో ఫీజులకు పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ఫీజు పోరు దీక్ష చేపడుతున్నామని అన్నారు.

అధికారంలోకి రాగానే ఫీజులకు బకాయిలను విడుదల చేస్తామని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామని, ఐదు లక్షల రూపాయలతో ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డులను అందజేస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.

గత రెండు సంవత్సరాల కాలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్రమంతా విద్యార్థులంతా ఉద్యమిస్తుంటే,రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని అబద్ధపు మాటలు చెబుతుందన్నారు,ఏడు వేల కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా బడా కాంట్రాక్టర్లకు 70 వేల కోట్ల రూపాయలను ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు 

గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పు చేశారని, తెలంగాణలోని ప్రతి మనిషికి 1,76 వేల రూపాయలు అప్పు రుద్దారని,అప్పు బడుగులపై రుద్ది, సంపద మాత్రం బడా కాంట్రాక్టర్లకు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం ఇంకొక వైపు 5 వేల కోట్ల తో గాంధీ విగ్రహం పెడుతున్నారని, 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఒకవైపు విద్యార్థి లోకమంతా డిమాండ్ చేస్తూ ఉంటే, కాలేజీ అమ్మాయిలకు ఈ స్కూటి లను ఇస్తామని, కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా దారుణం అన్నారు. విద్యార్థులకు కావాల్సింది స్కూటీలు ఎంగిలి మెతుకులు కాదని,ఆత్మగౌరవంతో చదువుకోవడానికి ఫీజుల రియంబర్స్మెంట్ లు కావాలని ఆయన డిమాండ్ చేశారు 

ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని,నాడు కాసోజు శ్రీకాంతాచారి నుండి మొదలుకొని సిరిపురం యాదయ్య వరకు విద్యార్థి అమరులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని,వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను హరిగోస పెడుతుందని,మళ్లీ విద్యార్థుల చావులకు కారణం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని,వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో పదివేల కోట్లు ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చ్ ఈనెల 15వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఫీజు పోరు దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాయి విగ్నేష్,రాజ్ కుమార్,మనిరాజ్,సుమన్,గణేష్,శివ,నిఖిల్,సందీప్,వరుణ్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >