| Daily భారత్
Logo




తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

News

Posted on 2026-03-14 17:35:48

Share: Share


తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

డైలీ భారత్, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లో  తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఈ రోజు జరిగింది తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి  మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాం ప్రసాద్ రావు కి, స్టేజీపై ఉన్న పెద్దలందరికీ,

ఈ సభకు విచ్చేసిన సంఘ సభ్యులందరికీ,

మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు

పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ 

నా పేరు మంజుల పత్తిపాటి.

నేను గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేశాను, ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి — నేను ఒక కరణం ముద్దుబిడ్డను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం, 

ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం సాధారణ సమావేశం కాదు.

ఇది మన చరిత్రను గుర్తు చేసే సమావేశం అని అన్నారు. 

ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగులు వెలిగించిన చేతులు మనవి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది.

కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి?

గ్రామాల్లో మనకు ఉన్న పరపతి తగ్గిపోయింది.

కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాం అని అన్నారు. 

ఒకప్పుడు పులిలా జీవించిన మనం,

ఇప్పుడు పిల్లిలా బ్రతుకుతున్న పరిస్థితి వచ్చింది.

దానికి ప్రధాన కారణం ఏమిటంటే 

మన మధ్య ఐక్యత లేకపోవడం.

మనలో చాలా మందిలో ఒక భావన పెరిగింది —

“నేను లాభపడకపోయినా పర్వాలేదు,

నా పక్కవాడు లాభపడకూడదు” అనే భావన.

ఈ భావనతో మన సమాజం ముందుకు వెళ్లదు.

ఒకరి బాధ అందరి బాధ కావాలి.

ఒకరి విజయం అందరి విజయం కావాలి.

అప్పుడే మన సమాజం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. 

ఈ సమావేశం కేవలం మన కోసం కాదు.మన తర్వాతి తరం మనలాగే కష్టాలు పడకూడదనే సంకల్పంతో జరుగుతున్న సమావేశం అని నేను భావిస్తున్నాను. మనము విడిపోయితే మన చరిత్ర మసకబారుతుంది. మనము కలిస్తే మన చరిత్ర మళ్లీ ప్రకాశిస్తుంది. 

ఒక మహిళగా నేను చెప్పేది ఒక్కటే 

ఇంటిని నిలబెట్టేది మహిళ అయితే,

మన సమాజాన్ని నిలబెట్టేది ఐక్యత.

అందుకే మన చేతులు మళ్లీ కలవాలి.

మన స్వరం మళ్లీ గర్జించాలి అని పిలుపునిచ్చారు. 

మన మధ్య దూరం పెరుగుతుందని, మన గౌరవం మెల్లగా తగ్గిపోతుందని గ్రహించిన మన అందరి ప్రియమైన బంధువు బండారు రాం ప్రసాద్ రావు అన్న, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం.

వారి కృషి వల్లనే ఈ రోజు మనం అందరం ఒకే వేదికపై కలిసే అవకాశం వచ్చింది. అందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను అని జై హిందూ! జై తెలంగాణ! అంటూ ముగించారు 

ఈ  కార్యక్రమంలో  చకిలం అనిల్ కుమార్ చందుపట్ల వెంకటేశ్వర రావు కరణం నాయకులు అందరూ పాల్గొన్నారు

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >