Posted on 2026-03-14 16:03:11
ఉద్యోగ అవకాశాల కోసం ముందుకొచ్చిన GCR చారిటబుల్ ట్రస్ట్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో GCR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న పార్శి రాములు కళ్యాణ మండపం వద్ద భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్, బ్యాంకింగ్, ఫార్మసీ, మార్కెటింగ్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సెస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు కామారెడ్డిలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన సంస్థల ప్రతినిధులు కూడా హాజరై యువతకు అవకాశాలు కల్పించనున్నారని చెప్పారు. మొత్తం 2000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ మేళాను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే GCR చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, రంగ రమేష్ గౌడ్, సబ్బాని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, రాశేఖర్, సునీల్, అరుణ్ పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >