| Daily భారత్
Logo




రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

News

Posted on 2026-03-14 14:28:12

Share: Share


రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

రాబరీ కేసు చేదించిన సూర్యాపేట జిల్లా సిసిఎస్, ఆత్మకూరు పోలీస్. 

నలుగురు నిందితుల అరెస్ట్.

నిందితులపై తొమ్మిది కేసులు గుర్తింపు. 

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి రాబరీ కేసులో అరెస్ట్. 

డైలీ భారత్, సూర్యాపేట: నిందితులు కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ ఒక ముఠాగా ఏర్పడి ఆటోలను దొంగలించి దొంగరించిన ఆటోలో ప్రయాణం చేస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా  చేసుకుని వృద్ధ మహిళ ను బెదిరించి ఆభరణాలు దొంగలించడం, దొంగలించిన ఆటోలోనే తిరుగుతూ రాత్రివేళ తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనం చేయడం వీరి పద్ధతి అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు.

సూర్యాపేట కోదాడ ప్రాంతాలకు చెందిన వీరు ముఠాగా ఏర్పడి ఈనెల 6 తేదీన ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని కోటి నాయక్ తండ శివారులో ఒక వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరము తీసుకువెళ్లి వృద్ధురాలని చంపుతామని బెదిరించి ఆమె నోరు మూసి ఆమె మెడలో ఉన్న వెండి గొలుసు దొంగలించుకొని వెళ్ళినారు దీనిపై సంబంధిత వారు 10వ తారీఖున ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా రాబరీ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా సిసిఎస్ పోలీసులు ఆత్మకూరు పోలీసులు నేరానికి పాల్పడ్డ వారిని టెక్నాలజీ ద్వారా గుర్తించి కదలికలను గమనిస్తూ ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఆత్మకూరు మండల పరిధిలోని ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు అనుమానిత వ్యక్తులు ఒక  టీఎస్ 29 టీ 1190  ఆటోలో నిమ్మికల్ వైపు వెళుతున్నారు. వీరిని ఆపి తనిఖీ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోదాడ రాజీవ్ నగర్ కు చెందిన కంచుకొమ్ముల సంతోష్ ఏ1, కంచుకొమ్ముల గణేష్ ఏ2, కంచుకొమ్ముల సాయికిరణ్ ఏ4, సూర్యాపేటకు చెందిన షేక్ నశ్రీన్ ఏ3 ఉగా గుర్తించడం జరిగింది. వీరిని విచారించగా గతములో మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడుగురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట  పోలీస్ స్టేషన్ ల పరిధిలో బంగారము ఆభరణములు, వెండి అభరణములు, వెండి వస్తువులు, ఆటోలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ దొంగతనము చేసినాము అని అంగీకరించగా వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి  3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, 5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి మరియు 4 లక్షల విలువైన 3 ఆటొలు, 50 విలువైన ట్యాబ్, ల్యాప్ టాప్, 1 బైకు, 1 టీవి, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడము జరిగినది. 

స్వాధీనం వివరాలు...

రూ.3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి, రూ.4 లక్షల విలువైన 3 ఆటొలు, రూ.50 విలువైన ట్యాబ్, ల్యాప్ టాప్ రూ.30 వేల విలువైన1 బైకు, రూ.25 వేల విలువైన 1 టీవి, రూ.30 విలువైన 3 సెల్ ఫోన్స్.

నిందితుల మద్య పరిచయం :

ఏ1 కంచుకొమ్ముల సంతోష్, ఏ4 కంచుకొమ్ముల సాయి కిరణ్ లు స్వంత అన్నదమ్ములు, ఏ2 కంచుకొమ్ముల గణేష్ ఏ1, ఏ4 ల బాబాయి కొడుకు, ఏ3 షేక్ నస్రీన్ ఏ1 కంచుకొమ్ముల సంతోష్ యొక్క బార్య. ఇట్టి కేసులో ఏ3 షేక్ నస్రీన్ యొక్క తమ్ముడు ఏ5  బాల నేరస్థుడు ఉన్నాడు. 

నిందితుల గత నేర చరిత్ర :

ఏ1 కంచుకొమ్ముల సంతోష్ పై కోదాడ టౌన్, కోదాడ రూరల్, వేములపల్లి నిడమానూరు, ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 9 కేసులు ఉన్నట్లు గుర్తించినాము.  ఏ2. కంచుకొమ్ముల గణేష్ పై కోదాడ టౌన్ లో 2 కేసులు మరియు నిడమనూర్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు ఉన్నట్లు గుర్తించినాము. ఏ4 కంచుకొమ్ముల సాయి కిరణ్ పై కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించినాము

ఈ కేసు చేదనలో బాగా పనిచేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, టెక్నికల్ టీం అర్ఎస్ఐ రాజశేఖర్ సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఆత్మకూరు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, హరికృష్ణ, అర్ఎస్ఐ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >
Image 1

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-05-08 19:58:59

Readmore >
Image 1

రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-05-08 19:20:14

Readmore >
Image 1

నకిలీ యజమానుల అవతారమెత్తి రూ. 16 లక్షల మోసం

Posted On 2026-05-08 19:16:53

Readmore >
Image 1

మీ పిల్లల భవిష్యత్తు భద్రమేనా.. ! (ఇది మీ కోసమే)

Posted On 2026-05-08 19:15:06

Readmore >
Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >
Image 1

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

Posted On 2026-05-08 16:57:17

Readmore >