| Daily భారత్
Logo




మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

News

Posted on 2026-03-14 13:07:18

Share: Share


మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

పోలీస్ శాఖలోనూ ప్రజా సంబంధాల విభాగం దివంగత డిజిపి హెచ్ .జె దొర దూరదృష్టికి నిదర్శనం

డైలీ భారత్, హైదరాబాద్: పోలీస్ శాఖ అంటే కేవలం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు, ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని చూరగొన్నప్పుడే ఆ వ్యవస్థకు పరిపూర్ణత లభిస్తుందని నమ్మిన అధికారి దివంగత డిజిపి హెచ్.జె.దొర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో  ప్రజా సంబంధాల విభాగం  మరియు పోలీస్ పి.ఆర్.ఓల వ్యవస్థ ఆయన  దూరదృష్టికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 2000 సంవత్సరం ప్రారంభంలో పోలీస్ అధికారుల వాణిని, శాఖా పరమైన విజయాలను విస్పష్టంగా ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో ఆయన ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులే ఈ విభాగం ఏర్పాటుకు ప్రధాన ప్రేరణగా నిలిచాయి.

ముఖ్యంగా సిపిఐ (ఎం.ఎల్) పీపుల్స్ వార్ కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న ఆ రోజుల్లో, నక్సలైట్లు తమ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి వినూత్న పద్ధతులను అనుసరించేవారు. వారు స్వయంగా ప్రజా కోర్టులను నిర్వహించడమే కాకుండా, కొరియర్ల ద్వారా వివిధ అంశాలను ఎప్పటికప్పుడు పత్రికలకు చేరవేస్తూ ప్రజల్లోకి వెళ్లేవారు. మరోవైపు, నక్సలైట్లకు మద్దతుగా వివిధ కళా బృందాలు, కళాకారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేసేవారు. పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలలో వాస్తవాలను తెలియజేసేందుకు వేదిక అవసరమని నాటి డిజిపి హెచ్ జె దొర గ్రహించారు. సమర్థవంతంగా పనిచేయడమే కాదు ఆ విధానాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిలాషించారు. ఈ నేపథ్యంలో సమాచార యుద్ధంలోనూ పైచేయి సాధించాలని భావించిన హెచ్.జె.దొర , పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రజాహిత చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ వ్యూహంలో భాగంగానే అన్ని జిల్లాల్లో జర్నలిస్టులుగా అనుభవం, అర్హత  కలిగిన వారిని పోలీస్ పి.ఆర్.ఓలుగా  నియమించి, పద్ధతి ప్రకారం సమాచార వ్యవస్థను బలోపేతం చేశారు. ఎప్పటికప్పుడు వాస్తవాలను పోలీస్ శాఖ తరఫున మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థ పని చేసేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, పోలీసుల తరపున ప్రత్యేక కళా బృందాలు అప్పటికే వరంగల్ డిఐజిగా హెచ్ జె దొర ఉన్నప్పుడు ప్రారంభమైన కళా బృందాలను మిగిలిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశారు. వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో ఈ కళాబృందాలు విస్తృతంగా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవి. 2001 వ సంవత్సరంలో నాడు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న డిజిపి బి . శివధర్ రెడ్డి పోలీసు సిబ్బందితో  దీటైన కళాబృందాన్ని ఏర్పాటు చేసి పీపుల్స్ వార్ కార్యకలాపాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ బృందాలు పల్లెపల్లెనా తిరుగుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, హింస వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను చట్టబద్ధమైన జీవనం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. నాడు ఆయన నాటిన ఆ మొక్క నేటికీ సోషల్ మీడియా యుగంలోనూ పోలీసులకు, సామాన్యులకు మధ్య వారధిలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పోలీసు శాఖ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌ను  సాకారం చేసేందుకు ప్రజా సంబంధాల విభాగం దోహదపడుతుంది.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >