Posted on 2026-03-14 08:35:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పోచారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
పోచారం పరిధికి చెందిన మనోహర్ యువకుడు ఎయిడ్స్ బాధితుడు. మనోహర్‌తో అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని దాచి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో ఆ పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో సదరు యువతిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి మనోహర్ వెళ్లాడు. తనతో పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షతో తన రక్షంతో కూడిన ఇంజెక్షన్‌ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >