డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా లోబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు రేపు గురువారం (26వతేదీ) ఖమ్మం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెలుగుమట్లలో తమ గూడు కోల్పోయి నిరాశ్రయులైన బడుగు జీవులను పరామర్శించి, ఓదార్చేందుకు గురువారం 11గంటలకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ ఖమ్మం చేరుకుంటారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై వెలుగుమట్ల బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా, కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరారు.
News
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు