Posted on 2026-02-25 14:31:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఫరూక్ నగర్ మండలం చింతగూడ గ్రామ పరిధిలోని శ్రీబాలాజీ పౌల్ట్రీ ఫామ్‌లో టికెదార్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఆత్మ మహతో తన స్వరాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి బూర్గుల, కాశిరెడ్డిగూడ, చింతగూడ, బాలానగర్, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది.పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 24 ఫిబ్రవరి సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆత్మ మహతోను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.7 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో సహకరిస్తున్న బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్, ప్రేమ్ రామ్‌లను కూడా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురిని షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించగా, కోర్టు ఆదేశాల మేరకు 25 ఫిబ్రవరి న రిమాండ్‌కు తరలించారు.
ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎ. బాలరాజు, ఎస్సై కె. వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు..
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >