Posted on 2026-02-24 03:35:06
25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకొని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు చెందిన 66 మంది సర్వేయర్లకు లైసెన్సులు గతంలో అందజేసిందని గుర్తు చేశారు. గత ఏడాది జిల్లాకు చెందిన సివిల్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 50 రోజుల పాటు శిక్షణ ప్రభుత్వం అందించిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో పాస్ అయిన 25 మందికి లైసెన్స్ పత్రాలను అందించామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. లైసెన్స్ పొందిన వారు అందరూ వారికి కేటాయించిన మండలాల్లో అందుబాటులో ఉండాలని, ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, నటరాజ్ సిబ్బంది ఉన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >