| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరణ

మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరణ

కామరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మరియు ఎంపీ సురేష్ శెట్కార్ సమక్షంలో చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి చే బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తొలి సంతకం చేయించడం జరిగింది.

తద్వారా జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ,సురేష్ శెట్కార్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రావాల్సిన నిధులు కామారెడ్డి మున్సిపాలిటీ కోసం వచ్చేలా కృషి చేస్తామని తద్వారా భవిష్యత్తులో కామరెడ్డి ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.

చైర్ పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరి కౌన్సిలర్లతో కలిసి కామరెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తామని తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,కాంగ్రెస్  కౌన్సిలర్లు,డీఈ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం
ADVERTISEMENT