| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మద్యం నిల్వలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పోలీస్ యంత్రాంగం పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు మరియు టిన్‌లు బయటపడ్డాయి. వీటి విలువ​సుమారు రూ. 54,589.

శాస్త్రి నగర్‌కు చెందిన కోలా మారుతి తన నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై అక్రమ రవాణా మరియు నిల్వ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, అనుమతి లేకుండా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Previous రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
Next ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT