Posted on 2026-01-26 12:46:35
మిర్చి కాంపౌండ్ లో బిజెపి యువ నాయకుడు ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నగరంలోని 34 వ డివిజన్ పరిధిలోని మిర్చి కంపౌండ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్( పండు) ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున తమ బిజెపి నాయకుడు పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి యువకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. పేద, మధ్య తరగతి వారికి ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమేనని తర్వాత (ఆవాస్) ఒక గృహాన్ని నిర్మించుకోవడం చిరకాల స్వప్నమని, వీటిని నిర్వర్తించి పేదలకు సమకూర్చాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించాక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చూశానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో గాంధీ, ఉస్మానియా, ఆస్పత్రుల తర్వాత అత్యధిక ఓపి పేషెంట్లు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, కేవలం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వైద్యం కోసం పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తారని ఎమ్మెల్యే అన్నారు. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా ఆరోగ్యపరమైన మిషిన్లు లేకపోవడం, అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండకపోవడం పేదవారు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన మిషన్ జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమైన విషయం అన్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ వహించి పేద ప్రజలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ హెల్త్ క్యాంప్ లో ఎంఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు జనరల్ మెడిసిన్ డాక్టర్ దొరబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ, న్యూరో సర్జన్ డాక్టర్ సర్పరాజ్ పాల్గొన్నట్లు బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య శిబిరంలో షుగర్ టెస్ట్ లు, బిపి టెస్టులతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >