డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో చట్టవిరుద్ధ కోడిపందేలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో గల ఇటుక బట్టీ ప్రాంగణంలో కోడిపందేలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు CCS కామారెడ్డి సహకారంతో సదాశివనగర్ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు.
ఈ దాడిలో కోడిపందేలు నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 11 మొబైల్ ఫోన్లు, రూ.45,050 నగదు, 65 కోడిపందేల కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక...
చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
#Kamareddy #Sadashivanagar #Tirmanpalli #CockFights #TelanganaPolice