| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ స్థాయి గుర్తింపు! టీమ్ వేగా సంచలనం! ఆల్ ఇండియా 7వ ర్యాంక్!

బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ స్థాయి గుర్తింపు! టీమ్ వేగా సంచలనం! ఆల్ ఇండియా 7వ ర్యాంక్!

డైలీ భారత్, నిర్మల్: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించారు!

విశ్వ విద్యాలయానికి చెందిన టీమ్ వేగా విద్యార్థులు జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ పోటీలో ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించి విశ్వ విద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు!

తమిళనాడులోని కోయంబత్తూరులో ఫ్రెటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి!

ఈ పోటీలో ఆర్జీయూకేటీ బాసరకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు స్వయంగా రూపొందించి తయారు చేసిన ఎలక్ట్రిక్ రేసింగ్ మోటార్ సైకిల్ తో పోటీలో పాల్గొని ఏడో స్థానాన్ని సాధించారు!

పరిమిత వనరులతో వినూత్న ప్రయోగం చేసి జాతీయ స్థాయి గుర్తింపు సాధించటం పట్ల విశ్వవిద్యాలయ ఉప కులపతి గోవర్ధన్ విద్యార్థులను అభినందించారు!

#DailyBharath #Basara #TripleIT #RGUKT #TeamVega #ElectricBike #NationalLevel #BreakingNews

Previous ప్రతిభ చూపిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందన! డిబేట్ లో ఫస్ట్ ప్లేస్! ఒక్కొక్కరికి రూ. 12 వేలు
Next కామారెడ్డి జిల్లాలో 24 వారాల పాటు శిక్షణ పొందనున్న నలుగురు ట్రైనీ డీఎస్పీలు
ADVERTISEMENT