| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రతిభ చూపిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందన! డిబేట్ లో ఫస్ట్ ప్లేస్! ఒక్కొక్కరికి రూ. 12 వేలు

ప్రతిభ చూపిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందన! డిబేట్ లో ఫస్ట్ ప్లేస్! ఒక్కొక్కరికి రూ. 12 వేలు

పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వారధి ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇటీవల నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నెహ్రూ నగర్ విద్యార్థినులు ముత్తు కావ్య, గాజుల లౌక్య, కొండ కావ్య ప్రథమ స్థానంలో నిలిచి ఒక్కొక్కరు రూ. 12 వేల నగదు బహుమతి, మాజీ చీఫ్ సెక్రటరీ, ఫౌండర్ వారధి ఫౌండేషన్ మోహన్ కందా, విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ గారి సంతకాలతో ప్రశంసా పత్రాలను పొందారు!

ఆ ప్రశంసా పత్రాలు, నగదును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం విద్యార్థులకు అందించి అభినందించారు!

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ, గైడ్ టీచర్ / ఆంగ్ల ఉపాధ్యాయులు గన్నమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #RajannaSircilla #CollectorGarimaAggarwal #VaradhiFoundation #DebateCompetition #Students #BreakingNews

Previous 2018 పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధృవ్ రాఠీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
Next బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ స్థాయి గుర్తింపు! టీమ్ వేగా సంచలనం! ఆల్ ఇండియా 7వ ర్యాంక్!
ADVERTISEMENT