| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి! కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో డీఐఈఓ తనిఖీ!

సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి! కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో డీఐఈఓ తనిఖీ!

సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి: డీఐఈఓ డా. శ్రీధర్ సుమన్! కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో తనిఖీ!

డైలీ భారత్, వరంగల్: ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల ఆన్ జాబ్ ట్రైనింగ్ తో సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ అన్నారు!

సోమవారం నాడు వరంగల్ నగరంలోని సత్యం కంప్యూటర్స్ లో నిర్వహించబడుతున్న ఓజేటీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు, అధ్యాపకులకు మార్గనిర్దేశం చేసారు!

నర్సంపేట కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల శిక్షణలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్, థియరీ రూం, అటెండెన్స్ కౌంటర్, తదితర విభాగాల్లో విద్యార్థుల పనితీరును తనిఖీ చేసారు!

ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఒకేషనల్ విద్యార్థులకు వృత్యంతర శిక్షణ తప్పనిసరని, విద్యార్థుల అనుభవాలను, రికార్డులను పరిశీలించి మార్కులు కేటాయిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎక్సెల్, ట్యాలీ, డాటా ఇంట్రప్రిటేషన్, పైవోట్ టేబుల్స్, డీటీపీ తదితర అంశాలపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు!

ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వారి రోజువారీ నేర్చుకునే రికార్డులను పరిశీలించారు! జిల్లాలోని అన్ని ఒకేషనల్ కళాశాలలు తమ విద్యార్థులను వృత్తి విద్యలో రాణించేలా మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు!

డీఐఈఓ పర్యటనలో కళాశాల అధ్యాపకులు ఝాన్సీ, భాగ్యలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #Warangal #DIEO #SridharSuman #OJT #Vocational #ComputerTraining #BreakingNews

Previous తెలంగాణలో భారీ ధాన్యం కుంభకోణం!? రూ.6,000 కోట్లకు పైగా ప్రభుత్వ ధాన్యం మళ్లింపు! రైస్ మిల్లర్లపై ఈడీ కొత్త కేసులు!
ADVERTISEMENT