డైలీ భారత్, అశ్వరావుపేట: ఈరోజు అశ్వరావుపేట రజబ్ అలీ భవన్ లో జరిగిన బికేఎంయు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది! ఈ సమావేశానికి గన్నిన రామకృష్ణ అధ్యక్షత వహించగా కామ్రేడ్ సయ్యద్ సలీం బికేఎంయు వర్కింగ్ ప్రెసిడెంట్, రేసు ఎల్లయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వీసంశెట్టి పూర్ణచందర్ రావు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు!
ఈ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నవంబర్ 26వ తారీఖున జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయాలని వారు కోరారు!
పేదలకు ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టు పోరాడి సాధించుకున్నటువంటి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయుటకు వి బి జి రామ్ జి అనే కొత్త పేరుతో తీసుకువచ్చి బడ్జెట్ తగ్గించడం జరిగింది! అందువల్ల వ్యవసాయ కార్మికులు వలస కార్మికులు పేదలు తీవ్రంగా నష్టపోతారు! ఇలాంటి మోసపూరితమైన కొత్త పేర్లతో పెట్టినటువంటి విబిజి రామ్ జి పథకాన్ని వెంటనే రద్దుచేసి పాత పద్ధతిలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకాన్ని కొనసాగించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు!
అనేక సంవత్సరాలుగా యూపీఏ వన్ యూపీఏ 2 ఉన్న సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టం అలాగే సమాచార హక్కు చట్టం ఇలాంటివి అనేకమైన పేదలకు ఉపయోగకరమైనటువంటి పథకాలను తీసుకువస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహం అంటూ లక్షల కోట్ల రూపాయలు వారికి మాఫీ చేస్తూ పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ బడ్జెట్ లో ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ తగ్గించడం చాలా హేయకరమైన చర్య! అందుకని వెంటనే గ్రామీణ కార్మికుల ఉపయోగం కోసం వలస కార్మికుల ఉపయోగం కోసం ప్రవేశపెట్టినటువంటి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకాన్ని కొనసాగిస్తూ 100 రోజుల నుండి 200 రోజులు పెంచి పథకాన్ని కొనసాగించాలి! అలాగే 800 రూపాయల దినసరి వేతనం ఇవ్వాలని అర్హులైన వ్యవసాయ కార్మికులకు 55 సంవత్సరాలకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు! ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలి!
ప్రకృతి సంపద అందరిదని అటవీ సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పేద వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి గిరిజనులు ఈనాడు అంతో ఇంతో పోడు కొట్టుకుని వ్యవసాయం జీవనం కొనసాగిస్తా ఉంటే వారిపై ఫారెస్ట్ దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి! భూములలో కందకాలు తీస్తా ఉన్నారు! అలాంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించే పద్ధతి వెంటనే మానుకోవాలని తక్షణం పెండింగ్ లో ఉన్నటువంటి పట్టాలను వెంటనే మంజూరు చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు!
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల ముందుకు ఆనాడు రావడం జరిగింది! ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు పెన్షన్ పెంపుదల చేయాలని వారు కోరారు! భద్రాద్రి జిల్లా అటవీ సంపదకు ఖనిజ సంపదకు నిలయమై ఉన్నది! ఈ ప్రాంత నీటి వనరులు సక్రమంగా వినియోగించుకునే దాంట్లో భాగంగా ప్రాజెక్టులు చెక్ డ్యాములు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారు కోరారు! కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో జనవరి 8, 9, 10 తారీకులలో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల నుంచి కదిలి వెళ్లాలని వారు కోరారు!
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి అని వీసంశెట్టి పూర్ణచందర్ రావు జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు!
ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వరావుపేట మండల కార్యదర్శి వగ్గెల అర్జున్ రావు, దమ్మపేట మండల కార్యదర్శి ధర్మా, సిపిఐ అశ్వరావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్, ఎఐటియుసి నాయకులు పఠాన్ జలాల్, అబ్బాస్, చిన్నారావు, నాగేశ్వరరావు, మహిళా సంఘం నాయకులు చీపుర్ల సత్యవతి, శ్రావణి, బికేఎంయు నాయకులు గద్ద సూర్య కుమారి, రసూల్బీ, రోహిణి, సజ్జ శ్రీను, కుంజ నాగేష్, సిపిఐ సీనియర్ నాయకులు సయ్యద్ జైనలవుద్దీన్, డేరంగుల చిన్నోడు, పెద్ద పోలయ్య, మరియు సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు!
#DailyBharath #Ashwaraopet #BhadradriKothagudem #BKMU #MGNREGS #CollectorOfficeDharna #BreakingNews #Telangana