| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెస్ట్ బెంగాల్ ఇకపై పశ్చిమ్ బంగా! పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం!

వెస్ట్ బెంగాల్ ఇకపై పశ్చిమ్ బంగా! పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం!

డైలీ భారత్, కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును పశ్చిమ్ బంగా గా మార్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది!

సోమవారం నవంబర్ 23 కోల్ కతాలోని రాష్ట్ర సచివాలయం నబన్నలో ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది!

డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం:

కేబినెట్ భేటీ అనంతరం సీఎం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు! డిసెంబర్ 4 నుంచి 14 వరకు 11 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా, డిసెంబర్ 9న రాష్ట్ర పేరు మార్పుపై అధికారిక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు! అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, తదుపరి చట్టపరమైన మరియు పార్లమెంటరీ ప్రక్రియల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు స్పష్టం చేశారు!

అన్ని భాషల్లోనూ ఒకే పేరు:

ఇప్పటివరకు బెంగాలీ భాషలో పశ్చిమ్ బంగా అని వాడుకలో ఉన్నప్పటికీ, ఆంగ్లంలో మాత్రం వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నారు! తాజా నిర్ణయం ప్రకారం, కేంద్ర ఆమోదం లభించిన తర్వాత ఇంగ్లీషుతో సహా అన్ని భాషల్లోని ప్రభుత్వ, పరిపాలనా పత్రాల్లో రాష్ట్రం పేరును Paschim Banga అనే రాయనున్నారు!

పేరు మార్పు వెనుక ప్రధాన కారణాలు:

చారిత్రక నేపథ్యం: 1947 జూన్ 20న జరిగిన బెంగాల్ విభజన చారిత్రక పరిణామాలను, రాష్ట్ర అవతరణ నేపథ్యాన్ని గౌరవించే ఉద్దేశంతో ఈ పేరును ఖరారు చేసినట్లు సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు! విభజన సమయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషికి గుర్తుగా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే జూన్ 20న పశ్చిమబంగ దివస్ నిర్వహిస్తోంది!

ఆల్ఫాబెటికల్ ప్రాధాన్యత: ప్రస్తుత పేరు ఆంగ్ల అక్షరమాల ప్రకారం W తో ప్రారంభం కావడం వల్ల, జాతీయ స్థాయి సమావేశాలు, ముఖ్యమంత్రుల సదస్సుల్లో బెంగాల్ ప్రతినిధులకు చివరి వరుసలో మాట్లాడే అవకాశం వస్తోంది! పేరు P తో మొదలైతే అక్షర క్రమంలో రాష్ట్రానికి ముందు వరుసలో ప్రాధాన్యత దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది!

రాజ్యాంగ ప్రక్రియ ఏంటి?

అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్రం పేరు వెంటనే మారదు! భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పరిశీలించి, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి మొదటి షెడ్యూల్ ను సవరించాల్సి ఉంటుంది!

గతంలో విఫలమైన ప్రయత్నాలు:

రాష్ట్రం పేరు మార్చాలనే ప్రతిపాదన కొత్తదేమీ కాదు! గతంలో వామపక్ష ప్రభుత్వం కూడా పశ్చిమ్ బంగా పేరును ప్రతిపాదించగా, 2018లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం పేరును బంగ్లా గా మార్చాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది! అయితే, పొరుగు దేశం బంగ్లాదేశ్ పేరుతో గందరగోళం ఏర్పడుతుందనే కారణంతో సహా పలు అంశాల దృష్ట్యా కేంద్రం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదు! ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో ఈసారి పశ్చిమ్ బంగా పేరుకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

#DailyBharath #WestBengal #PaschimBanga #SuvenduAdhikari #Cabinet #Assembly #BreakingNews


Previous కామారెడ్డి జిల్లాలో 24 వారాల పాటు శిక్షణ పొందనున్న నలుగురు ట్రైనీ డీఎస్పీలు
ADVERTISEMENT