| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ లో కలకలం: భూ వివాదం నేపథ్యంలో ఎంఐఎం నేత మూర్తుజా పైల్వాన్ దారుణ హత్య!?

హైదరాబాద్ లో కలకలం: భూ వివాదం నేపథ్యంలో ఎంఐఎం నేత మూర్తుజా పైల్వాన్ దారుణ హత్య!?

డైలీ భారత్, హైదరాబాద్: నగర శివారులోని హిమాయత్ సాగర్ సమీపంలో ఎంఐఎం కార్యకర్త, మాజీ రౌడీషీటర్ మహమ్మద్ మూర్తుజా అలీ అలియాస్ మూర్తుజా పైల్వాన్ దారుణ హత్యకు గురయ్యారు! సోమవారం నవంబర్ 23 సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో హిమాయత్ సాగర్ ఎకో పార్క్ కొత్వాల్ గూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది!

ఘటన వివరాలు:

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మూర్తుజా పైల్వాన్ ఒక స్థల వివాదం రియల్ ఎస్టేట్ సైట్ విషయమై చర్చించేందుకు హిమాయత్ సాగర్ రోడ్డులోని తన స్థలం వద్ద మరికొందరితో కలిసి ఉన్నారు! అదే సమయంలో సుమారు 8 నుండి 10 మందితో కూడిన దుండగుల ముఠా కత్తులు, తల్వార్లతో అక్కడికి దూసుకొచ్చి మూర్తుజాపై విచక్షణారహితంగా దాడి చేసింది!

ఈ దాడిలో ఆయన తల, శరీరంపై తీవ్రమైన లోతైన గాయాలై అధిక రక్తస్రావం జరిగింది! దాడి అనంతరం దుండగులు అక్కడి నుండి పరారయ్యారు! రక్తపు మడుగులో పడి ఉన్న మూర్తుజాను స్థానికులు వెంటనే అత్తాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి జర్మంటెన్ హాస్పిటల్ తరలించారు! అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు! మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు!

ఎవరీ మూర్తుజా పైల్వాన్?

రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మూర్తుజా అలీ స్థానికంగా ఎంఐఎం పార్టీ కార్యకర్తగా చురుగ్గా వ్యవహరించేవారు! గతంలో ఇతనిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ 2023 వరకు యాక్టివ్ గా ఉంది నమోదై ఉంది! 2015లో మీరాలం ట్యాంక్ వద్ద జరిగిన హత్య కేసుతో పాటు, 2021లో జరిగిన మరో హత్య కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి!

పోలీసుల దర్యాప్తు మరియు భద్రత:

మూర్తుజా మరణవార్త తెలియగానే ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ తో పాటు మూర్తుజా అనుచరులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు! దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు! శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు! భూ వివాదాలు లేదా పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు! నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు!

#DailyBharath #Hyderabad #HimayatSagar #MurtuzaPailwan #AIMIM #Murder #BreakingNews #Shamshabad #Telangana

Previous వెస్ట్ బెంగాల్ ఇకపై పశ్చిమ్ బంగా! పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం!
ADVERTISEMENT