వెంకట సాయి నగర్ కాలనీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి!
సీసీ రోడ్ల పనులకు ఆటంకాలు కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ సీఐ కి కాలనీ వాసుల ఫిర్యాదు!
డైలీ భారత్, హైదరాబాద్: రామంతాపూర్ భగాయత్ లోని వెంకట సాయి నగర్ కాలనీలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, ఈ విషయంలో కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు!
కాలనీలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం రోడ్ల లెవెల్స్ నిర్ణయించి సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు! అయితే, కె. నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ అభివృద్ధి పనులకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు!
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను అడ్డుకోవడం వల్ల కాలనీలో అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటమే కాకుండా, స్థానిక ప్రజలకు రాకపోకల విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు! ఈ వ్యవహారంపై ప్రశ్నించిన కాలనీ వాసులపై డయల్ 100 కు ఫోన్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీంతో కాలనీలో అనవసర ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు!
ఈ నేపథ్యంలో వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మరియు కాలనీ వాసులు కలిసి ఉప్పల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వై. రామలింగారెడ్డిని కలిసి ఫిర్యాదు అందజేశారు! ఇంజినీరింగ్ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, వ్యక్తిగత అభ్యంతరాల పేరుతో ప్రజా అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కాలనీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు!
కాలనీలో ప్రజలందరికీ ఉపయోగపడే అభివృద్ధి పనుల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను సంప్రదించి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించవద్దని కాలనీ సభ్యులు స్పష్టం చేశారు! రోడ్ల నిర్మాణ పనుల విషయంలో అధికారుల నిర్ణయాలను గౌరవిస్తూ, కాలనీలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు!
ఫిర్యాదును స్వీకరించిన ఉప్పల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వై. రామలింగారెడ్డి కాలనీ వాసులతో మాట్లాడుతూ, వెంకట సాయి నగర్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆటంకాలు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు!
ప్రజా ప్రయోజనాల కోసం ఇంజినీరింగ్ శాఖ చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగి పూర్తయ్యేలా సంబంధిత అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి, కాలనీ సభ్యులు కోరారు!
ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రెటరీ అశోక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ, కాలనీ సభ్యులు లక్ష్మి, మహేష్ గౌడ్, చిటికెల శ్రీనివాస్, పశ్యయం నరసింహ, చిటికెల వెంకట స్వామి, వెంకటరమణ, జంగయ్య, రమేష్, అనిల్, నేరడి శేఖర్, వెంకటేష్, గణేష్, చిటికెల మహేష్ తదితరులు పాల్గొన్నారు!
#DailyBharath #Hyderabad #Uppal #Ramanthapur #VenkataSaiNagar #CCRoads #BreakingNews #Telangana