డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లి గ్రామానికి తరలివెళ్లి, ఆయనకు ఘన నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మరియు ఏన్కూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, గిద్దరిగి సత్యనారాయణ, తాళ్లూరి రామారావు, మద్దిశెట్టి ప్రకాష్, బాదావత్ నరేష్ (ఉప సర్పంచ్), పురస్తపురవు రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, లేళ్ల సీతయ్య, ధర్మరాజుల సీతయ్య, కోదండరామపురం మాజీ సర్పంచ్ బోడా వినోద, షేక్ బాజీ, కడియాల సుధాకర్, రాచబంటి వీరభద్రం, షాక్ చాంద్ పాషా, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు సాయిన్ని హరీష్, రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ గంగావత్ సాయి గుగులోత్ మహేష్, బత్తుల అశోక్, మద్దిబోయిన రాజ్ కుమార్, పుప్పాల సత్యనారాయణ, గుగులోత్ బిక్కు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం, ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులు అర్పించారు.