| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

ప్రథమ స్థానంతో వైరా కీర్తిని విశ్వవేదికపై నిలిపిన నిఖితకు ఘన అభినందనలు

డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ దంపతుల కుమార్తె మాదినేని నిఖిత మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి ఘన విజయాన్ని అందుకున్నారు.

నిఖిత సాధించిన ఈ అద్భుత విజయం వైరా నియోజకవర్గానికే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి అత్యున్నత స్థానాన్ని సాధించిన నిఖిత విజయం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాదినేని నిఖితను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి వైరా ప్రాంతానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని లకావత్ గిరిబాబు ఆకాంక్షించారు.

మాదినేని నిఖితకు హృదయపూర్వక అభినందనలు నీ విజయం మరెందరో యువతకు స్ఫూర్తిగా నిలవాలిభవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

Previous ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...
Next నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
ADVERTISEMENT