| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రసంగించారు.గ్రామీణాభివృద్ది, విద్యాశాఖ, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన నిర్వహించడం జరిగినది. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ సందర్శించారు.గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా  వివిధ పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, చెవి మిషన్లు, చేనేతే రుణమఫి పథకం కింద 82,51,257/- రూపాయల చెక్కును, జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు 797,21,00,000/- రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె,చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డి.సి.పి బి.రాజేశ్ ఐపిఎస్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Previous గణతంత్ర దినోత్సవం రోజున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం
Next మంత్రిపై వ్యాఖ్యలు చేస్తే పాతరేస్తాం... బొల్లం మల్లయ్యకు కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక
ADVERTISEMENT