| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంత్రిపై వ్యాఖ్యలు చేస్తే పాతరేస్తాం... బొల్లం మల్లయ్యకు కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక

మంత్రిపై వ్యాఖ్యలు చేస్తే పాతరేస్తాం... బొల్లం మల్లయ్యకు కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక

డైలీ భారత్, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బొల్లం మల్లయ్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం హుజూర్‌నగర్ పట్టణ కేంద్రం రణరంగంగా మారింది. నిరసన జ్వాలలు హుజూర్ నగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ పిలుపు మేరకు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇందిరా గాంధీ చౌక్ వద్దకు చేరుకున్నారు. బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్య యాదవ్‌కు లేదని మండిపడ్డారు. ఉనికి కోల్పోయిన మల్లయ్య యాదవ్, కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గానీ, కాంగ్రెస్ నాయకత్వంపై గానీ నోరు పారేసుకుంటే నియోజక వర్గంలో తిరగనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. మల్లయ్య యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Previous ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Next రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన విజయ్ కి సన్మాన మహోత్సవ కార్యక్రమం
ADVERTISEMENT