| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన వెంగల వెంకటేశం హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రాజకీయ ప్రత్యర్థిని ఇరికించేందుకు పనివాడినే కిరాతకంగా హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది.

ఫిర్యాదు నుండి మృతదేహం వరకు... 

06-08-2026 రాత్రి 9:00 గంటలకు తారకరామానగర్‌కు చెందిన వెంగల వెంకటేశం, 50, ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని భార్య వెంగల సులోచన సిరిసిల్ల టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలించగా, 08-08-2026 ఉదయం 11:15 గంటలకు రగుడు శివారులో వెంకటేశం మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది.

CCTV ఆధారంగా బ్రేక్‌త్రూ

వెంకటేశం చివరిగా ఎవరితో కలిసి ఉన్నాడనే కోణంలో పోలీసులు CCTV ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో B.Y. నగర్‌కు చెందిన కుసుమ గణేష్, 51తో కలిసి తిరిగినట్లు ఆధారాలు లభించాయి. గణేష్‌ను 08-08-2026 మధ్యాహ్నం ఎల్లమ్మ చౌక్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

రాజకీయ కుట్ర కోసమే హత్య... 

విచారణలో గణేష్ సంచలన విషయాలు వెల్లడించాడు. వెంకటేశం తన వద్ద చాలా కాలంగా పనిచేస్తున్నాడని, తరచుగా పనికి రాకపోవడం, మధ్యలో వెళ్లిపోవడంతో గొడవలు జరిగేవని చెప్పాడు. 

ఇదే అదునుగా వాడుకుని పెద్ద కుట్రకు తెరతీశాడు. దార్ల సందీప్‌పై ఇందిరమ్మ ఇల్లు అవకతవకల కేసు ఉండటం, సందీప్‌కు, మార్గం లక్ష్మణ్‌కు మధ్య రాజకీయ వైరం ఉండటాన్ని ఆసరాగా తీసుకున్నాడు. ఈ హత్యను "సందీప్ వేధింపుల వల్ల ఆత్మహత్య"గా చిత్రిస్తే సందీప్ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని, లక్ష్మణ్‌కు ఎదురు ఉండదని ప్లాన్ వేశాడు.

పథకం ప్రకారం 06-08-2026న బట్టల రంగు పనిలో వాడే నైట్రాప్ పాయిజన్‌ను MC విస్కీ క్వార్టర్‌లో కలిపాడు. వెంకటేశంను రగుడు శివారుకు రప్పించి ఆ మద్యం తాగించాడు. విషం పనిచేసి వెంకటేశం కింద పడిపోగానే గణేష్ అక్కడి నుండి పరారయ్యాడు.

ఇతర అరెస్టులు... 

ఈ కేసులో రాజకీయ కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, లక్ష్మణ్‌కు సన్నిహితులుగా ఉన్న లక్ష్మణ్, పోసు రమేష్, పసునూరి సూర్య ప్రకాష్ మరియు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఆధారాలు స్వాధీనం... 

పోలీసులు నిందితుడి నుండి నేరానికి ఉపయోగించిన Motor Cycle, 2 మొబైల్ ఫోన్లు, నైట్రాప్ పాయిజన్, MC విస్కీ బాటిల్, నిందితుడి బట్టలు, Cap మరియు మృతుడి వద్ద ఉన్న Paer Note ను స్వాధీనం చేసుకున్నారు.

కేసును సమర్థంగా ఛేదించిన సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, SI నాగరాజు, HC పుల్కం శ్రీనివాస్ మరియు సిబ్బందిని SP అభినందించారు.

Previous వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Next తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
ADVERTISEMENT