Posted on 2026-01-15 15:46:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని వినాయక నగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగురంగుల సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గాలిపటం ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ సంస్కృతికి పరిమితం కాకుండా, మన పండుగల ప్రాముఖ్యతను గుర్తించి సంస్కృతిని కాపాడాలని సూచించారు. వినాయక నగర్ వాసులు ఐక్యంగా పండుగను జరుపుకోవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. నగరాన్ని అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు నిలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >