| Daily భారత్
Logo




పుర పోరుకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధం

News

Posted on 2026-01-09 12:57:11

Share: Share


పుర పోరుకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధం

మాట్లాడుతున్న నున్నా నాగేశ్వరరావు.

 ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో సత్తా చాటిన సిపిఐ(ఎం)

రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి.

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.

డైలీ భారత్, వైరా:పురపాలక సంఘాల ఎన్నికలకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధంగా ఉందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, ముఖ్యుల జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన సిపిఎం  పోరాడుతుందని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజల్లో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు.  ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేయటం, పేద వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు, కూలీలు, కార్మికులు, యువజనులు, విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పనిచేయడం వలన ప్రజల్లో పార్టీ బలం పెరిగిందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఎం తన సత్తాను చాటిందని,  అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారని అన్నారు. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో సిపిఐ(ఎం) సత్తా చాటి 26 సర్పంచులు, 33 ఉప సర్పంచ్ లు, 387 వార్డు మెంబర్లును గెలిచిందని గుర్తు చేశారు. నిస్వార్ధంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం)ను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బోడేపూడి వీరభద్రం, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, షేక్ జమాల్ సాహెబ్, మందడపు రామారావు, మల్లెంపాటి రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, చావా కళావతి, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి రామారావు, తాటి ఏసు, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, శాఖ సభ్యులు, ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >