| Daily భారత్
Logo




"ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి" పేరిట జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల కలకలం

News

Posted on 2025-12-16 15:17:15

Share: Share


"ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి" పేరిట జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల కలకలం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన లలిత కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం వినూత్నంగా తమ కాంప్లెక్స్ ఎదుట ప్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసనక తెలిపారు. ఫ్లెక్సీలో సారాంశం ప్రకారం గత ఎనిమిది నెలల క్రితం జెసిపి ద్వారా తమ కాంప్లెక్స్ ఎదుట పగలగొట్టి వెళ్లారని అది ఇప్పటివరకు పూడ్చకుండా పాలకులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మురికి కాలువ పక్కనుండి నిజామాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక కార్పొరేటర్లు పలుసార్లు పర్యటించినప్పటికీ తమ సమస్యకు వారు పరిష్కారం చూపడం లేదని ఆందోళనతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద కలకలం సృష్టిస్తుంది. తమ కాంప్లెక్స్ ఎదుట గల మురికి కాలువను సరిచేయమని లలితా కాంప్లెక్స్ షాప్ రెంటర్స్ అందరూ కలిసి గతంలో ఇదివరకు మున్సిపాలిటీ సిబ్బందికి అధికారులకు ఫిర్యాదు చేశామని, దీనికి తోడు జిల్లా కలెక్టర్ కు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని అక్కడి నుండి కూడా ఎలాంటి స్పందన రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. గత 8 నెలల క్రితం మున్సిపాలిటీ అధికారులు జెసిపి ద్వారా పగలగొట్టి వెళ్లిన మురికి కాలువ ద్వారా దానికి మరమ్మతులు చేయకపోవడంతో దీని ద్వారా ఏర్పడిన దుర్వాసన, దోమల ద్వారా తమ కాంప్లెక్స్ లోని వాళ్లందరూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని దీని ద్వారా తీవ్రంగా నష్టపోవడం జరిగిందని వారు ఈ ఫ్లెక్సీ ద్వారా నిరసన  ఆందోళన వ్యక్తం చేశారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >