డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీబీపేట మండలం మాందాపూర్, ఉప్పరపల్లి గ్రామాల మధ్యన కంగరికుంట ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు పలువురు రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. మాందాపూర్ సర్పంచ్ హరీశ్ సైతం ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే అంబారీపేట, సంగమేశ్వర్, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి తదితర గ్రామాల్లో ఆవు, లేగదూడ, గేదెలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. డీఎఫ్ఓ నిఖిత, డిఆర్ఓ రామకృష్ణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ పలు ప్రాంతాలను సందర్శించారు.
News
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పెద్ద పులి సంచారం... భయాందోళనలో ప్రజలు