| Daily భారత్
Logo




రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

News

Posted on 2026-07-28 14:02:59

Share: Share


రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

డైలీ భారత్, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు,  కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ గారిని కలిసి ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుంపటి రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులకు నెలకు ₹5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు నెలకు ₹3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఉప సర్పంచులతో పాటు వార్డు సభ్యుల పేర్లను కూడా పొందుపరచాలని, ఉప సర్పంచులకు చట్టబద్ధమైన హక్కులు, అధికారాలు, విధులను స్పష్టంగా అమలు చేసి గ్రామపంచాయతీల్లో వారి పాత్రను బలోపేతం చేయాలని కోరారు.

అదేవిధంగా మండల స్థాయి అధికారిక కార్యక్రమాలకు ఉప సర్పంచులను తప్పనిసరిగా ఆహ్వానించాలని, గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచులకు తగిన గుర్తింపు కల్పించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

వినతి పత్రాన్ని స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ గారు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు ఉప సర్పంచుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దుంపటి రాజు తెలిపారు.

అదేవిధంగా పెద్దపల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉప సర్పంచ్ రవి గారి మృతికి జిల్లా ఉప సర్పంచుల ఫోరం తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి స్వామి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజీవ్, జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగరాజు,జిల్లా మైనార్టీ సెల్ ఇమ్రాన్, వార్డు మెంబర్స్ జిల్లా కన్వీనర్ వికాస్ గౌడ్, వార్డు మెంబర్స్ రాష్ట్ర కమిటీ సభ్యులు దేవరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు.

Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >