Posted on 2025-12-16 09:08:21
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:తెలంగాణ పల్లెల్లో గత కొన్ని రోజులుగా మారుమోగిన ప్రచార హెూరు ముగిసింది. మైకుల శబ్దాలతో, జెండాల ఊపులతో రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగిన ఎన్నికల సందడి ఒక్కసారిగా ఆగిపోయింది. నిన్నటి వరకు జనసందోహంతో ఉప్పొంగిన వీధులు నేడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం వెనుక గెలుపు సంబరాల ఉత్సాహం దాగిఉంది. గ్రామాల్లో గడప గడపకు వెళ్లి తమ విధివిధానాలు వివరించి, హామీలతో ఆకట్టుకున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రజా తీర్పు కోసం సిద్దమయ్యారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో
7 మండలాల పరిధిలోని అనేక గ్రామ పంచాయతీలలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన సర్పంచ్ పోరులో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల పార్టీల బలం మాత్రమే కాదు,అభ్యర్థుల గుణగణాలు, ప్రజలతో వారి అనుబంధం కూడా కీలకంగా మారనుంది.
ఇంతకాలం సర్పంచ్ ఎన్నికల హడావుడితో గడిచిన పల్లెలు ఇప్పుడు శాంతంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రజల మనసుల్లో మాత్రం కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయోనని గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరాలని మాటలు కాదు పనులే కావాలని గ్రామాలు ఎదురు చూస్తున్నాయి.
గత రెండు విడత ల్లో జరిగిన ఎన్నికలు పార్టీల స్థితిగతులు, అభ్యర్థుల కార్యాచరణ, ప్రజల మద్దతు ఈ మూడు కలిసి ఫలితాలను ఎలా మలిచాయో స్పష్టంగా చూపించాయి. మరి మూడో విడత ఎన్నికలు పాలనలో ఏ విధమైన మార్పు దిశగా మారుతాయో వేచి చూద్దాం
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >