Posted on 2025-12-09 08:11:59
- నలుగురు నిందితుల అరెస్ట్.
- 12 లక్షల రూపాయల నగదు స్వాధీనం.
- 5 నకిలీ బిస్కెట్లు స్వాధీనం.
డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు అరెస్టు వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్. తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవరూ నమ్మవద్దు తక్కువ దొరకు బంగారం రాదు అని గుర్తుంచుకోవాలి. ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తానంటే అది నకిలీ బంగారం అని గుర్తించండి పోలీస్ వారికి సమాచారం అందించండి అని ప్రజలను ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ కేసు వివరాలు వెల్లడిస్తూ ఈనెల ఆరవ తేదీ హనుమకొండ కు చెందిన సూర్యనేని వెంకటేశ్వర రావు అనే వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు నకిలీ బంగారంకు సంబంధించి మోసపోయినట్లు మొదటి నిందితుడు నాగేశ్వరరావు, నాలుగోవ నిందితుడు నరేష్, ఏడవ నిందితుడు అదినారాయణ, మూడవ నిందితుడు శ్రీనివాసరావు మరి కొంతమంది కలిసి నకిలీ బంగారం అంటగట్టి 12 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీసులు బాలెంల గ్రామ శివారు ఖమ్మం జాతీయరహదారి ఫ్లై ఓవర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొంతమంది వ్యక్తులు కారులో, చుట్టుప్రక్కల ప్రాంతంలో అనుమానాస్పదంగా కనబడగా పోలీసు వారు గుర్తించి వారిని పట్టుబడి చేసే సమయంలో కారులో ఉన్న వ్యక్తులు పారిపోయారు, అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుబడి చేయడం జరిగింది. వీరిని విచారించగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కు చెందిన ఇర్రి నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాకు చెందిన మేడి ఆదినారాయణ, యోగి రెడ్డి, పిట్ట నాగిరెడ్డిగా తెలపడం జరిగింది.
కేసు వివరాల్లోకి వెళితే గత నెల 25వ తేదీన ఇర్రి నరేష్ కు సుధాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనకు తెలిసిన నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద బంగారం ఉంది అట్టి బంగారం తక్కువ ధరకు అమ్ముతాడు ఆ బంగారాన్ని మనం రూ.90 వేల అమ్మి పెడితే కమిషన్ ఇస్తాడు అని చెప్పగా ఒప్పుకుని బంగారం చూడాలని నరేష్ తెలపగా 27వ తేదీన సూర్యాపేట పట్టణంలో హైటెక్ బస్టాండ్ వద్ద ఇర్రీ నరేష్, సుధాకర్ లు కలవడం జరిగినది, సుధాకర్ వెంట మరి కొంత మంది శ్రీనివాసరావు, చంద్ర ఆదినారాయణ వచ్చారు. వీరు అందరూ కలిసి బాలెంల గ్రామ శివారులో అరుణ టిఫిన్ సెంటర్ వెనుక ఇంట్లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు @ రాజారం అనే మొదటి నిందితుడి ఇంటికి వెళ్లినారు. అప్పుడు ఇంట్లో నాగేశ్వరరావు మరియు అతని తమ్ముడు బాల ఇద్దరు ఉన్నారు వారి వద్ద ఉన్న నకిలీ బంగారం బిల్లలు చూయించి ఇవి ఒక్కొక్కటి 20 గ్రాములు ఉన్నవి వీటిని అమ్మి పెడితే 10% కమిషన్ ఇస్తామని నరేష్ కు తెలపగా సులభంగా డబ్బులు వస్తాయని ఉద్దేశంతో నరేష్ బంగారం అమ్ముటకు ఒప్పుకుని కన్నయ్య అనే ఆటో డ్రైవర్ ను వారికి పరిచయం చేసి బంగారం తక్కువకు ధరకు ఉందని దానికి బిల్లులు ఉండవు అని తెలిపినారు. నరేష్ కు ఇది నకిలీ బంగారం అని తెలిసినప్పటికీ కన్నయ్యకు అసలు బంగారం అని తెలిపి 90 వేలకు అమ్మితే మనకు 10 శాతం కమిషన్ వస్తుందని తెలిపినాడు. కన్నయ్య అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్న హనుమకొండకు చెందిన వెంకటేశ్వరరావు మరియు లీలా అనే వారికి తక్కువ ధరకు అనగా తులం 90 వేల రూపాయలకు వస్తుందని చెప్పిగా నమ్మిన వెంకటేశ్వరరావు బంగారం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈనెల 6వ తేదీన మూడు గంటల సమయంలో వెంకటేశ్వరరావు, లీలా ను తీసుకొని మూడు గంటల సమయంలో సెవెన్ హోటల్ వద్దకు రాగా అక్కడ ఉన్న సుధాకర్, ఆదినారాయణ, శ్రీనివాసరావు, యోగా రెడ్డి, నాగిరెడ్డి, చంద్ర లు వెంకటేశ్వరరావు వద్ద ఉన్న ఐదు లక్షలు, మామిడి లీల వద్ద ఉన్న ఏడు లక్షల రూపాయలు మొత్తం 12 లక్షల రూపాయలు చూసి వారిని బాలెంల గ్రామంలో గల నాగేశ్వరరావు ఇంటికి తీసుకువెళ్ళడం జరిగినది. 10 బంగారం బిళ్ళలు కొనడానికి అంగీకరించి వారి వద్ద ఉన్న డబ్బు 12 లక్షల రూపాయలు తీసుకొని వారికి ఐదు బిల్లలు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బు చెల్లించిన తర్వాత ఐదు బిళ్ళలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసు వారు తనిఖీలు నిర్వహిస్తారు దొరికిపోతామని ఉద్దేశంతో డబ్బును ఇర్రి నరేష్ వద్ద ఉంచాలని నాగేశ్వరరావు చెప్పినాడు.
ఈరోజు అనగా 8వ తేదీన నాగేశ్వరరావు నరేష్ కు ఫోన్ చేసి డబ్బులు తీసుకొని బాలెంల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పడం జరిగింది, వెంకటేశ్వర రావు వాళ్లు మిగిలిన డబ్బు తీసుకువస్తే మిగిలిన 5 బిల్లలు ఇస్తాము డబ్బు తీసుకొని రమ్మని చెప్పగా నరేష్ కన్నయ్యకు అదే విషయం చెప్పగా కన్నయ్య, వెంకటేశ్వరరావు, రవి కారులో బాలెంల ఫై ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చినారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీస్ వారు వారిని పట్టుబడి చేయడం జరిగింది.
నకిలీ బంగారము కేసు ఛేదించిన కేసులో బాగా పని చేసిన G.రాజశేఖర్, సూర్యాపేట రూరల్ CI, N.బాలు నాయక్, సూర్యపేట్ రూరల్ SI, సూర్యపేట రూరల్ PS సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ K.సుధర్శన్, కానిస్టేబుల్స్ G.చైతన్య, P.ఉమామహేశ్వర్, హోమ్ గార్డ్ సాయి శంకర్ లను ఎస్పీ అభినందించారు.
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >