Posted on 2026-04-18 11:16:08
డైలీ భారత్, ఆగ్రా: ఓ మహిళ ప్రియుడిని చాలా కూల్ గా చంపేసి, అంతకంటే కూల్ గా హోటల్ రిసెప్షన్ దగ్గరకొచ్చి, పోలీస్ కు ఫోన్ చేసింది. నా లవర్ ని చంపేశాను.. సుత్తితో తలమీద కొట్టి, కత్తితో గొంతు కోసి చంపేశా.. హోటల్లోనే ఉంటాను, రండి అని నిదానంగా చెప్పింది. ఆ మహిళ కూల్ యాటిట్యూడ్ చూసి హోటల్ సిబ్బంది వణికిపోయారు. పోలీస్ వచ్చాక వాళ్లతో వ్యాన్ ఎక్కి స్టేషన్ కు వెళ్లింది. ఆగ్రాలో నిన్ననే జరిగిందీ ఘోరం. 29 ఏళ్ల వివాహిత, తన 36 ఏళ్ల ప్రియుడితో 11 గంటలకు హోటల్ కు వచ్చింది. గంటలో ఏమైందో ఏమో కిందకొచ్చి తన లవర్ ను చంపేశానని చెప్పింది. ఇద్దరూ దూరపు బంధువులే. ఆమెకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల కాలంలో ప్రియుడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అందుకే చంపేశానని చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత కిరాతకమైన హత్య ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వివాహిత తన ప్రియుడిని దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వివాహిత మరియు ఆమె ప్రియుడు కలిసి ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారి మధ్య ఏదో విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ, తన వెంట తెచ్చుకున్న సుత్తితో అతడి తలపై బలంగా బాదింది. దీంతో అతను స్పృహ కోల్పోగా, అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపేసింది.
హత్య జరిగిన వెంటనే సదరు మహిళ పారిపోకుండా, తానే ఈ హత్య చేశానని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలు హత్యకు గల బలమైన కారణం ఏమిటనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వివాహేతర సంబంధం వికటించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >