| Daily భారత్
Logo




"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Devotional

Posted on 2026-04-18 10:21:32

Share: Share


"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

డైలీ భారత్, సింహాచలం: నరసింహ స్వామి ఉగ్ర మూర్తి భయం కొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్న స్వామి లో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు నిరంతరం చందనపు పూత లో దర్శనమిస్తాడు.

స్వామి. ఏడాదికోమారు అక్షయ తృతీయనాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రయ పడుతూ కనిపిస్తాడు అప్పన్న స్వామి.

స్వామి వారి చందనోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం..

చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులు చేసే దేవాదిదేవుడు సింహాచలం అప్పన్న స్వామీ.

చందనపు పూత లో స్వామి సుమారు మూడు అడుగుల ఎత్తుతో శివలింగం మాదిరిగా గుండ్రంగా దర్శనమిస్తాడు.

 వాస్తవానికి స్వామికి రూపం ఉన్న ఆరూపం అంత చందనంతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు అంటే అక్షయ తృతీయ రోజు మినహా మిగతా అన్ని రోజులు స్వామివారు చందనం పూత లోనే ఉంటారు దీనిని నిత్యరూపం అని పిలుస్తారు.

ఏడాదికి ఒక రోజు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజ రూపంలో దర్శనమిస్తారు.

నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో మానవ దేహం తో సింహపు తోకతో జూలుతో ఉంటాడు. కుడిచేతి వేళ్ళతో గరుత్మంతునికి అమృతం తాగిస్తూ ఎడమచేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు.

స్వామి కిరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు.

సింహాద్రి అప్పన్న ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక స్తంభం దర్శనమిస్తుంది దానికి కప్ప స్తంభం అని పేరు .

స్వామి వారిని దర్శించిన భక్తులు ఈ స్తంభాన్ని కౌగిలించుకోవడం ఇక్కడ ఆచారం .

ఆనాడు  శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుడుని  రక్షించటానికి వచ్చాడు .

"పవిత్రాణాయ సాధూనాం "సత్పురుషులను రక్షించటానికి వస్తానన్నాడు కృష్ణుని  వాగ్దానం ప్రకారం అవతారానికి ప్రధాన లక్ష్యం శిష్టరక్షణ  దాని అనుబంధ ప్రయోజనం దుష్టశిక్షణ.

Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >