| Daily భారత్
Logo




మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

News

Posted on 2026-04-18 17:04:25

Share: Share


మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన  "ఖాకీ హీరోలు"

పోలీసుల సాహసానికి ఎస్పీ ప్రశంసలు

సాహసం… సమయస్ఫూర్తి… మానవతా దృక్పథం

విధిలో మెరిసిన కామారెడ్డి పోలీసులు

ఉరి నుంచి ప్రాణం… ట్యాంక్‌పై నుంచి రక్షణ… ఖాకీ సాహస గాథలు

నేర నియంత్రణతో పాటు ప్రాణరక్షణలోనూ ముందున్న కామారెడ్డి జిల్లా పోలీసులు 

విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్న పోలీస్ సిబ్బంది 

అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రదర్శించిన అప్రమత్తత, సాహసం, మానవతా దృక్పథాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు చూపిన  సమయస్ఫూర్తి బాధితులను కాపాడటంతో పాటు, నేరాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

1. ఉరి వేసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడిన బాన్సువాడ పోలీసులు

బాన్సువాడ పట్టణంలో ఆస్తి తగాదాల కారణంగా మనస్తాపంతో ఉరివేసుకున్న రంగరి వెంకటి అనే వ్యక్తిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది పిసి డి. నవీన్, హోంగార్డ్ రాములు ‘డయల్ 100’ ద్వారా సమాచారం అందగానే వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, గడియ పెట్టిన తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న బాధితుడిని కాపాడి పునర్జన్మనిచ్చారు.

2. వాటర్ ట్యాంక్‌పై ఆత్మహత్యాయత్నం, కాపాడిన రాజంపేట పోలీస్ సిబ్బంది

రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామంలో ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా, పెట్రోలింగ్ సిబ్బంది కానిస్టేబుల్ జె. శ్రీనివాస్, హోంగార్డ్ రాజిరెడ్డి సాహసోపేతంగా & చాకచక్యంగా వ్యవహరించి ట్యాంక్‌పైకి ఎక్కి అతడిని క్షేమంగా కిందకు దించారు.

3. అర్ధరాత్రి చెరువు వద్ద ఆత్మహత్యాయత్నం భగ్నం చేసిన సదాశివనగర్ పోలీసులు 

సదాశివనగర్ మండలం టెక్రియాల్ చెరువు వద్ద అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది పి.సి. వినయ్ రెడ్డి, హోంగార్డ్ మురళి, ఏఆర్‌హెచ్‌సీ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. బాధితుడితో సున్నితంగా మాట్లాడి ప్రాణాపాయం నుండి బయటపడేలా చేశారు.

4. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై రామారెడ్డి పోలీసుల మెరుపు దాడి

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి సుమారు 8 క్వింటాళ్ల బియ్యాన్ని  చాకచక్యంగా వ్యవహరించి కానిస్టేబుల్ చందర్, హోంగార్డ్ కైలాష్ పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.

5. గస్తీలో అప్రమత్తత – దొంగను పట్టుకున్న  కామారెడ్డి పట్టణ పోలీసులు

కామారెడ్డి పట్టణంలో బీట్ డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాబయ్య, హోంగార్డ్ లింబాద్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు గత నేర చరిత్ర కలిగి ఉన్నాడు.  తద్వారా జరగబోయే నేరాలను అడ్డుకున్నారు. వారి నిబద్ధతను గుర్తించిన ఎస్పీ నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ

“మానవ ప్రాణం అత్యంత విలువైనది. క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తాయి. సమస్య ఏదైనా సరే, ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు. ఒత్తిడిలో ఉన్నవారు పోలీసుల సహాయం తీసుకోవాలి. డయల్ 100 సేవలను వినియోగించుకోవడం ద్వారా పోలీసుల సేవలను అతి త్వరగా పొదవచ్చు” అని సూచించారు.

విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బంది నిజమైన "ఖాకీ హీరోలు" అని కొనియాడిన ఎస్పీ గారు, నేర నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో చూపిన మానవతా దృక్పథమే పోలీసు శాఖకు గౌరవాన్ని మరింత పెంచుతుంది. అలాగే, బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రశంసనీయంగా ఉంటుందని , ప్రజల భద్రత కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


Image 1

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

Posted On 2026-05-12 16:38:01

Readmore >
Image 1

బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

Posted On 2026-05-12 16:37:06

Readmore >
Image 1

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Posted On 2026-05-12 11:14:01

Readmore >
Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >