| Daily భారత్
Logo




2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2025-12-08 19:32:03

Share: Share


2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మీర్ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.సోమవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. వేడుకకు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, పలు రంగాల ప్రముఖులు ఉన్నారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , తెలంగాణ ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్ , నోబెల్ శాంతి గ్రహీత కైలా‌ష్ సత్యార్థి , టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్. దినేష్ , అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్  శోభన కామినేని , అదానీ పోర్ట్స్ & సేజ్ మేనేజింగ్ డైరెక్టర్  కరణ్ అదానీ  తదితరులు ప్రసంగించారు.నోబెల్ గ్రహీత శ్రీ అభిజిత్ బెనర్జీ , వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్  సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే విధంగా 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను ఎంచుకోవాలి.

ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ

ప్రజా ప్రభుత్వంలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం.. దేశానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నాం.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , తెలంగాణ డీజీపీ  శివదర్ రెడ్డి , స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ , సీనియర్ అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రపంచ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు.


Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >